టి-20లో పాకిస్థాన్‌ ఇంటికి...ఆస్ట్రేలియా ఫైనల్స్‌కి

November 12, 2021
img

టి-20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో నిన్న ఓ అద్భుతం జరిగింది. ఈసారి వరుస విజయాలతో దూసుకుపోతున్న పాకిస్థాన్‌ జట్టును ఆస్ట్రేలియా ఓడించి ఇంటికి పంపించేసి దర్జాగా ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. పాక్‌ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా జట్టు తట్టుకోలేక 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇక ఓటమి ఖాయం అనుకొంటున్న తరుణంలో బరిలోకి దిగిన మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ ఇద్దరూ కలిసి పాక్‌ బౌలర్లు వేసిన ప్రతీ బాల్‌ని చితకబాదారు.   

మార్కస్ స్టోయినిస్ కేవలం 31 బంతులలో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేయగా, మాథ్యూ వేడ్ 17 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు చేసి ఇంకా మరో ఓవర్ మిగిలి ఉండగానే 177 పరుగుల లక్ష్యాన్ని చేధించి తమ జట్టును గెలిపించుకున్నారు. వారిద్దరూ ప్రతీ బాల్‌తో ఫోర్లు, సిక్సర్ షాట్స్ కొడుతుంటే స్టేడియంలో ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతూ చిందులు వేశారు. ఇక ఆస్ట్రేలియా పని అయిపోయిందని అనుకొంటున్న సమయంలో మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ ఇద్దరూ విజృంభించి జట్టును గెలిపించుకోవడం ఒక అనూహ్య పరిణామం కాగా ఈసారి తప్పకుండా టి-20 ప్రపంచ కప్ తీసుకువెళతామని గట్టిగా నమ్ముతున్నా పాకిస్థాన్‌ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం మరో అనూహ్య పరిణామమే అని చెప్పవచ్చు. వేడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్ లభించింది.  

పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 67; బాబర్ అజామ్ (సి) వార్నర్ (బి) జంపా39; ఫకార్ జమాన్ నాటౌట్ 55; ఆసిఫాబాద్‌లో ఆలీ (సి) స్మిత్ (బి) కమీన్స్ (0); షోయబ్ మాలిక్ (బి)  స్టార్క్ 1; హఫీజ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 13, మొత్తం 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు. 

వికెట్ల పతనం:1-71,2-143,3-158,4-162. 

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రిజ్వాన్ (బి) షాబాద్ 49; పించ్ ఎల్బీ (బి) శహీన్ అఫ్రీది 0; మిచెల్ మార్ష్ (సి) ఆసిఫ్ (బి) షాబాద్ 28; స్టీవ్ స్మిత్ (సి) ఫకార్ జమాన్ (బి) షాదాబ్ 5; మ్యాక్స్ వెల్ (సి) రావూఫ్ (బి) షాదాబ్ 7; స్టాయినీస్ నాటౌట్ 40; వేడ్ నాటౌట్ 41; ఎక్స్‌ట్రాలు:7 మొత్తం 19 ఓవర్లలో 177 పరుగులు. 

వికెట్ల పతనం: 1-1,2-52,3-77,4-89,5-96.         

సూపర్-1, సూపర్-2 గ్రూపుల నుంచి సెమీస్‌లో విజేతలుగా నిలిచిన ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ జట్లు ఈనెల 14న జరిగే ఫైనల్స్‌లో తలపడనున్నాయి.

Related Post