కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై

September 17, 2021
img

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. టీ-20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు విరాట్ ప్రకటించాడు. బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపాడు. భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఓ పెను సంచలనం. ధోనీ జట్టు కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ఆ బాధ్యతను స్వీకరించి భారత్‌ జట్టుకు అనేక విజయాలను అందించారు. విరాట్ టీ-20 కెప్టెన్సీలో భారత్‌ జట్టు 45 మ్యాచ్‌లు ఆడగా వాటిలో 27 మ్యాచ్‌లు గెలిచి, 14 మ్యాచ్‌లలో పరాజయం పొందింది. మరో రెండు మ్యాచ్‌లు టైగా ముగిసాయి. వీటిని పరిశీలిస్తే విరాట్ కోహ్లీ విజయశాతం ఎక్కువగా ఉంది. టి-20 తర్వాత కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. బీసీసీఐ ఇంకా నిర్ణయం ప్రకటించవలసి ఉంది. ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు వచ్చే నెల 17 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు యూఏఈ, ఒమేన్‌లో జరగనున్నాయి.


Related Post