కల్వకుంట్ల కవితకు బెయిల్‌ నిరాకరణ

May 07, 2024


img

లిక్కర్ స్కామ్‌ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసులో సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన కేసులలో ఆమె బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా రెంటినీ న్యాయమూర్తి కావేరీ బవేజా తిరస్కరిస్తున్నట్లు సోమవారం తీర్పు చెప్పారు.

ఈ సందర్భంగా ఆమె సుప్రీంకోర్టు నిమ్మగడ్డ ప్రసాద్ వర్సస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఉదహరిస్తూ దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే ఇటువంటి నేరాలకు బెయిల్‌ ఇవ్వలేమని చెప్పడం విశేషం. 

నేటితో ఆమె జ్యూడిషియల్ రిమాండ్‌ ముగుస్తుంది. కనుక ఆమె అభ్యర్ధన మేరకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆమెను కోర్టులో హాజరుపరచడానికి న్యాయమూర్తి అంగీకరించారు. అయితే ఇప్పటికే ఆమె బెయిల్‌ పిటిషన్లు రెండూ తిరస్కరించినందున, ఆమెకు మరో 2 వారాలు  జ్యూడిషియల్ రిమాండ్‌ పొడిగించడం ఖాయమే. 

రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెకు బెయిల్‌ లభించడాని స్పష్టం అయ్యింది కనుక ఇప్పుడు ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. 


Related Post