ఆహా ఓటీటీలో షరతులు వర్తిస్తాయి

May 18, 2024


img

పెద్ద సినిమాలతో పాటు ఎటువంటి అంచనాలు లేకుండా అనేక చిన్న సినిమాలు కూడా వస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే అందరినీ మెప్పించగలుగుతాయి. థియేటర్లలో పోటీ తట్టుకొని నిలబడలేకపోయిన అటువంటి మంచి సినిమా ‘షరతులు వర్తిస్తాయి’ ఇప్పుడు ఆహా ఓటీటీలో ప్రసారం అవుతోంది. కుమార స్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 15వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. 

ఈ సినిమాలో చైతన్య రావు, భూమిశెట్టి జంటగా నటించారు. ఓ మద్యతరగతి కుటుంబం జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఒడిదుడుకులే ఈ సినిమా కధ. ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న హీరో తన కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటాడు. కానీ భార్య పొరపాటు వలన ఆర్ధికంగా ఆ కుటుంబం ఎదురుదెబ్బ తింటుంది. దాని నుంచి ఆ కుటుంబం ఏవిదంగా బయటపడింది? ఆ ప్రయత్నంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అనేదే ఈ సినిమా కధ.

దర్శకుడు కుమార స్వామి ఈ కధాని చక్కగా చక్కగా తెరకెక్కించడం, నటీనటులు కూడా చక్కగా నటించడంతో ప్రేక్షకులు సినిమాని ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది కనుక ఓటీటీ ప్రేక్షకులు ఇంట్లో కూర్చోనే ఈ సినిమాని చూసి ఆనందించవచ్చు. 


Related Post

సినిమా స‌మీక్ష