సుచిత్ర వద్ద మల్లారెడ్డి అనుచరులు హంగామా

May 18, 2024


img

మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు  శనివారం ఉదయం హైదరాబాద్‌ సుచిత్రా క్రాస్ రోడ్స్ వద్ద చాలా హంగామా చేశారు. సుచిత్రా పరిధిలో గల సర్వే నంబర్ 82లో 1.11 ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేశారు.

కానీ దానిపై వివాదం ఏర్పడటంతో ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. కొందరు వ్యక్తులు ఆ భూమి చుట్టూ పోల్స్ పాతి ఫెన్సింగ్ వేశారు. ఈ విషయం తెలియడంతో మల్లారెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. వారు వేసిన ఫెన్సింగ్‌ని మల్లారెడ్డి అనుచరులు తొలగించారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ మల్లారెడ్డి పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇది నా భూమి. కోర్టు కూడా నాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అటువంటప్పుడు నా భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి వాళ్ళు ఎవరు? అడ్డుకోవడానికి మీకేమి హక్కు ఉంది? కావాలంటే నాపై కేసు నమోదు చేసుకోండి. కానీ నా భూమిని నేను కాపాడుకుంటాను,” అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. 

చివరికి పోలీసులు ఆయనకు, అవతల పార్టీని శాంతింపజేసి, భూవివాదం ఉంటే కోర్టులో తేల్చుకోమని చెప్పి పంపేశారు.


Related Post