టీవీ ఆర్టిస్ట్ చందూ ఆత్మహత్య... తల్లి, భార్య ఆవేదన

May 18, 2024
img

తెలుగు టీవీ సీరియల్స్ లో నటించే చంద్రకాంత్ (చందు) శుక్రవారం ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన తల్లి, భార్య శిల్ప తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఆయన భార్య మీడియాతో మాట్లాడుతూ, “స్కూల్లో చదువుతున్నప్పుడే చందూ, నేను ప్రేమలో పద్దాము, ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నాము. మాకు ఇద్దరు పిల్లలు.

నేను, పిల్లలు అంటే ప్రాణం పెట్టె చందూ, త్రినయిని సీరియల్ చేయడం మొదలు పెట్టాక మమ్మలని పట్టించుకోవడం మానేశాడు. తర్వాత తెలిసింది ఆయన పవిత్ర జయరాంతో మళ్ళీ ప్రేమలో పడ్డారని, ఆమెతోనే సహజీవనం చేస్తున్నారని.

అయినా ఎప్పటికైనా మారుతారని ఎదురుచూసేదానిని. కానీ ఆయన ఆమె మాయలో పడి మమ్మల్ని పూర్తిగా వదిలేశారు. చివరికి ఆమె గుండెపోటుతో చనిపోయిందని ఆమె కోసం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం మాకు ఇంకా బాధ కలిగిస్తోంది. ఇప్పుడు నేను, నా ఇద్దరి పిల్లలు అనాధలుగా మిగిలిపోయాము,” అని ఆవేదన వ్యక్తం చేశారు. 

చందూ తల్లి మీడియాతో మాట్లాడుతూ, “నా కొడుకు ఇంత పని చేస్తాడనుకోలేదు. వేరే అమ్మాయి మోజులో పడి నా కోడలిని, మనుమలని పట్టించుకోకుండా వదిలేశాడు. అప్పుడప్పుడు తాగి వచ్చి ఆమెను కొడుతుండేవాడు. గత 5 ఏళ్ళుగా ఆ అమ్మాయితో వేరే కాపురం పెట్టాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. చివరికి ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Related Post