ఎయిర్ ఇండియా విమానం ఇంజన్‌లో మంటలు

May 19, 2024
img

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో మళ్ళీ వెనక్కు వచ్చి బెంగళూరు విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు.

శనివారం రాత్రి బెంగళూరు లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 179 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం కేరళలోని కొచ్చికి బయలుదేరింది. గానీ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఒక ఇంజన్‌లో మంటలు చెలరేగిన్నట్లు పైలట్లు గుర్తించి, బెంగళూరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

విమాన సిబ్బంది ప్రయాణికులకు ధైర్యం చెపుతుండగా, పైలట్లు విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలో జాగ్రత్తగా ల్యాండ్ చేశారు. అప్పటికే సిద్దంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పేసి ప్రయాణికులను బస్సులలో అక్కడి నుంచి విమానాశ్రయంలోకి తరలించారు. 

అంతకు ముందు రోజే ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం తాలూకు ఏసీ యంత్రాలలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇలాగే మంటలు చెలరేగాయి. వెంటనే ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు.

Related Post