అమెరికా బయలుదేరుతున్న బచ్చన్

May 08, 2024


img

మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్‌ హరీష్ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకి ‘నామ్ తో సునా హోగా...!’ (పేరు వినే ఉంటారుగా) సబ్ టైటిల్‌గా పెట్టారు. 

ఇప్పటికే హైదరాబాద్‌, ఉత్తర ప్రదేశ్‌లో షూటింగ్‌ షెడ్యూల్స్ పూర్తి చేశారు. త్వరలో అమెరికా బయలుదేరబోతున్నారు. రవితేజ, హీరోయిన్‌గా నటిస్తున్న భాగ్యశ్రీ బొర్సేలతో రెండు పాటలు చిత్రీకరించేందుకు అమెరికా బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష