దేవర ఫస్ట్ సింగిల్… సంగీత భరితమైన రక్తపాతం

May 19, 2024


img

జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో సిద్దమవుతున్న ‘దేవర’ (మొదటి భాగం) నుంచి ఆదివారం సాయంత్రం ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. రేపు (సోమవారం) జూ.ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానులకు కానుకగా ఈ పాట విడుదల చేశారు.

‘ఫియర్ సాంగ్’ అనే టైటిల్‌కు తగ్గట్లుగానే పాటలోనే చాలా రక్తపాతం చూపారు. భయం అంటే తెలియని కొందరు మృగాళ్ళకు భయం పరిచయం చేస్తానని జూ.ఎన్టీఆర్‌ ఇదివరకే ఓ డైలాగ్ చెప్పారు.

కనుక ఈ పాట అందుకు అనుగుణంగానే సాగుతూ లయబద్దంగా నరుకుడు చూపించారు. అనిరుద్ రవిచంద్ర అందించిన సంగీతం పాటకు తగ్గట్లుగానే ఉద్రేకపూరితంగా సాగింది.   

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్‌, షైన్ టామ్ చాకో, సైఫ్ ఆలీ ఖాన్ తదితరులు దేవరలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్‌. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.     

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. దేవర మొదటి భాగం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 



Related Post

సినిమా స‌మీక్ష