ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్‌కి ప్రమాదం

May 19, 2024
img

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ ప్రమాదానికి గురైంది. ఆయన విదేశాంగ మంత్రి హోసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్, కొందరు అధికారులు, భద్రతా సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం మూడు హెలికాఫ్టర్లలో పొరుగునే ఉన్న అజర్‌బైజాన్ వెళ్ళి తిరిగి వస్తుండగా, ఇరాన్ రాజధాని టెహ్రా న్‌కు సుమారు 600 కిమీ దూరంలో తూర్పు అజర్‌బైజార్‌ వద్ద జోల్పా నగరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ కూలిపోయిన్నట్లు వార్తలు వచ్చాయి 

కానీ పైలట్ చాకచక్యంగా హెలికాఫ్టర్‌ని హార్డ్ ల్యాండింగ్ చేయడంతో రైసీతో సహా దానిలో ప్రయాణిస్తున్నవారు తృటిలో ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. హార్డ్ ల్యాండింగ్ చేయడంతో హెలికాఫ్టర్‌ వెనుక భాగం కొద్దిగా విరిగిపోయింది. 

అధ్యక్షుడు రైసీతో పాటు మరో రెండు హెలికాఫ్టర్లలో భద్రతా సిబ్బంది, అధికారులు ప్రయాణిస్తుండటంతో వెంటనే ఇరాన్‌ రక్షణశాఖకు సమాచారం ఇచ్చి, రెండో హెలికాఫ్టర్‌లో ఆయనను క్షేమంగా రాజధాని టెహ్రాన్‌లోని అధ్యక్ష భవనానికి చేర్చిన్నట్లు తెలుస్తోంది.

Related Post