ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్ ఫోటో

May 19, 2024


img

ఆనంద్ దేవరకొండని మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబీ వంటి సినిమాలతో ఇంతవరకు పక్కింటి అబ్బాయిగానే అందరూ చూశారు. కానీ ఈసారి గంగం గణేశా చిత్రంలో పూర్తి యాక్షన్ హీరోగా చూడబోతున్నాము. ఈ సినిమా కోసం ఆనంద్ దేవరకొండ చాలా శ్రమించి ‘సిక్స్ ప్యాక్’ సాధించాడు. గంగం గణేశా టీమ్‌ విడుదల చేసిన ఆ ఫోటోని చూస్తే ఆనంద్ దేవరకొండేనా? అని అనుమానం కలుగుతుంది. ఈ సినిమా టీజర్‌ ఇదివరకే విడుదలై సినిమాపై అంచనాలు పెంచింది.   

ఈ సినిమాలో ఆనంద్‌కు జంటగా ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇమ్మానుయెల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి, సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: ఆదిత్య జువ్వాది, కొరియోగ్రఫీ: పోలాకి విజయ్, స్టంట్స్‌: నభ, అంజి, ఆర్ట్: కింద మామిడి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష