రేవంత్‌ ప్రకటనతో రైతు భరోసా నిలిపివేత

May 08, 2024


img

రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా (రైతు బంధు) సొమ్ముని ఈ నెల 9వ తేదీలోగా వారి బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటించారు. పోలింగ్‌ దగ్గర పడుతున్న సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేవిదంగా ముఖ్యమంత్రి రైతు భరోసా నిధుల విడుదల గురించి ప్రకటన చేయడాన్ని తప్పు పడుతూ బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. 

దానిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ, పోలింగ్‌ ప్రక్రియ (మే 13) ముగిసే వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా నిధుల విడుదలకు తాము సూచించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అతిక్రమించినందున, గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు ఈసీ లేఖలో పేర్కొంది. 

ఇదివరకు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా శాసనసభ ఎన్నికలకు ముందు రైతులను ఆకట్టుకోవడానికి ఇదేవిదంగా ప్రయత్నిస్తే అప్పుడు కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకుంది. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసి అడ్డుకుంది. సంక్షేమ పధకాలు ప్రజలకు మేలు చేసేందుకే అని ఓ పక్క చెప్పుకుంటూనే వాటితో ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం అధికారంలో ఉన్న పార్టీలకు పరిపాటిగా మారిందని ఇది స్పష్టం చేస్తోంది.


Related Post