ఇండియన్-2 సినిమా రిలీజ్ వాయిదా?

May 05, 2024


img

కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో మొదలుపెట్టిన ఇండియన్-2 సినిమాకి మొదటి నుంచి ఏదో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. అన్ని అవరోధాలు ఎదుర్కొని ఇక జూన్ 13న సినిమా రిలీజ్ చేసేందుకు సిద్దమైతే ఇప్పుడు వాయిదా వేయక తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్ సీన్‌ షూటింగ్‌ నేటికీ పూర్తికాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 

కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కనుక ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా ఆ సమయంలో వేరే సినిమాలు విడుదల చేసేందుకు అందరూ వెనకాడతారు. ఒకవేళ ఈ సినిమా జూన్ 13న విడుదల చేయలేక దసరా దీపావళి పండగ సీజన్‌ వరకు సాగితే ఆ సీజన్‌లో ఆశపెట్టుకున్న చిన్నా పెద్ద సినిమాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చిన్న నిర్మాతలు నష్టపోతారు. కనుక ఇండియన్-2 వాయిదా పడకుండా ఉండాలని అందరూ ప్రార్దిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష