టోక్యో ఒలింపిక్స్‌ సెమీస్‌లోకి భారత్‌ మహిళా హాకీ జట్టు

August 02, 2021
img

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. సోమవారం ఇరుజట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. భారత్‌ మహిళా హాకీ జట్టుకు ఆస్ట్రేలియా చాలా బలమైన ప్రత్యర్థి అయినప్పటికీ ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకుండా తమ సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో భారత్ 1-0 తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ఒలింపిక్స్‌లో 49 సంవత్సరాల తర్వాత భారత మహిళా హాకీ జట్టు మొదటిసారిగా క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సెమీ ఫైనల్స్ లోకి దూసుకు వెళ్తోంది. ఆగస్టు 4వ తేదీన సెమీ ఫైనల్స్ జరగనున్నాయి.


Related Post