టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ తాజా పరిస్థితి

August 01, 2021
img

మహిళ ల సింగిల్స్ బ్యాడ్మింటన్: తెలుగు అమ్మాయి పీవీ.సింధు చైనా క్రీడాకారిణి తెయజు చేతిలో పోరాడి ఓటమిపాలైంది. సింధు వరుస సెట్లలో18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. సింధు మొదట చాలా ధాటిగా ఆడినప్పటికీ కాస్త తడబడడంతో తెయజు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చురుకుగా ఆడుతూ గెలిచింది. అయితే ఈ పోటీలో సింధూ ఓటమిపాలైనప్పటికీ నేడు (ఆదివారం) మరో సెమీ ఫైనల్ ఆడనుంది. ఈ పోటీలో గెలిచిన వారికి కాంస్య పతకం దక్కుతుంది.

పురుషుల హాకీ జట్టు: పురుషుల హాకీ జట్టు మొదటి నుంచి ఉత్తమ ప్రదర్శనతో దూసుకుపోతోంది. శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్‌ జట్టు జపాన్‌ జట్టుతో తలపడి 5-3 తేడాతో సునాయాసంగా గెలిచి క్వార్ట ర్స్‌లోకి అడుగు పెట్టింది. 

పూల్- ఏలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా ఇండియా హాకీ జట్టు రెండో స్థానంలో ఉంది. తర్వాత క్వార్టర్ ఫైనల్లో ఇండియా హాకీ జట్టు యూకే జట్టుతో పోటీ పడనుంది.

మహిళల హాకీ జట్టు: దక్షిణాఫ్రికాతో చివరి లీగ్ మ్యాచ్ శనివారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 4-3 తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. లీగ్ దశలో మహిళా హాకీ జట్టు ఐదు మ్యాచ్‌లలో రెంటిలో గెలవగా, మూడింటిలో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో మహిళా హాకీ జట్టు నాలుగో స్థానంలో ఉంది. యుకె- ఐర్లాండ్ జట్ల మద్య జరిగే మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓటమి పాలవడంతో భారత్‌ మహిళా హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.  

డిస్కస్ త్రో: ఈ విభాగంలో కమల్ ప్రీత్ కౌర్ చక్కటి ప్రతిభను కనబరిచి తదుపరి పోటీలో నిలిచింది. కమల్ ప్రీత్ కౌర్ మొదటి రౌండులో ఆమె 60.29 మీటర్లు, రెండో రౌండులో 63. 97 మీటర్లు, మూడో రౌండ్లో 64 మీటర్లు విసిరి ఫైనల్స్ కి అర్హత సాధించింది. దీంతో భారత్‌కు మరో పతకం ఖాయం అయింది.

Related Post