వరల్డ్ కప్-2 షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ

July 15, 2021
img

ఐసీసీ ప్రథమ ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్షిప్‌ను విజయవంతంగా నిర్వహించింది. మొదటి ప్రపంచ కప్ చాంపియన్షిప్‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకోగా ఇండియా రన్నరప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఐసీసీ రెండో ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ రెండవ డబ్ల్యుటిసి మ్యాచ్‌లు వచ్చే నెలలో ప్రారంభమై 2023 మార్చి వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్  పాయింట్లు ఇచ్చే విధానంలో సల్ప మార్పులు చేసింది. దీని ప్రకారం ఒక్కో మ్యాచ్ విజయానికి 12 పాయింట్లు, ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే 4 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లను కేటాయించాలని ఐసీసీ నిర్ణయించింది. 

అయితే క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తి రేకెత్తించే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరగడం లేదు. ఇండియా రెండవ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్‌ మ్యాచ్‌లలో కొన్నిటిని స్వదేశంలో, కొన్ని విదేశాలలో ఆడనుంది. స్వదేశంలో ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో ఇండియా మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ దేశాలలో మ్యాచ్‌లు ఆడనుంది.


Related Post