ఐపిఎల్-14లో మిగిలిన మ్యాచ్‌లు యూఏఈలో : బీసీసీఐ

May 29, 2021
img
ఐపీఎల్ సీజన్-14 మిగిలిన మ్యాచ్‌లను మళ్ళీ యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. ఈవిషయం బీసీసీఐ స్వయంగా ప్రకటించింది.
ఐపీఎల్ సీజన్-14 ఏప్రిల్ 9న ప్రారంభమై మే 3 వరకు మొత్తం 60 మ్యాచ్‌లు జరుగవలసి ఉండగా కరోనా తీవ్రత కారణంగా 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. మిగిలిన 31 మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. వాటినే బీసీసీఐ మళ్ళీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. శనివారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అధ్యక్షతన వర్చువల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. 
 ఐపీఎల్ సీజన్-14లో మిగతా 31 మ్యాచ్‌లను యూఏఈలో సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు బీసీసీఐ  సన్నాహాలు ప్రారంభించిది. ఐపీఎల్ సీజన్-13లో బీసీసీఐ మిగిలిన 13 మ్యాచ్‌లను గత ఏడాది సెప్టెంబర్‌లో యూఏఈలో నిర్వహించింది. ఇప్పుడు కూడా అలానే ఐపీఎల్ సీజన్-14లో మిగిలిన 31 మ్యాచ్‌లను యుఏఈలో నిర్వహించబోతోంది. 

Related Post