ఇంగ్లాండ్‌పై ఇండియా ఘనవిజయం

March 06, 2021
img

అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చివరి టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. ఇండియా 3-1 తో సిరీస్ కైవసం చేసుకుంది.

మూడో రోజు ఇండియా 294 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించి మరో 71 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మూడో రోజు ఆటలో వాషింగ్టన్ సుందర్ 96, అక్షర్ పటేల్ 43 పరుగులు చేసి ఇండియా ను పటిష్ట స్థితిలో ఉంచారు. ఆ తర్వాత వచ్చిన ఇషాంత్ శర్మ, సిరాజ్ పరుగులేమీ చేయకుండా అవుట్ అయ్యారు. ఇండియా మొదటి ఇన్నింగ్స్ 365 పరుగులు చేసి ఆలౌట్ అవడంతో 160 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

తర్వాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి ఇండియా స్పిన్నర్లు విజృంభించి  విజయాన్ని తేలిక చేశారు. ఇంగ్లాండ్‌ టీం 135 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో డేనియల్ లారెన్స్ 50, జో రూట్ 30 పరుగులతో  టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు. ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లకు చెరో 5 వికెట్లు పడ్డాయి. ఇండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రిషబ్ పంత్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యారు. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌లో ఇండియా టాప్ పొజిషన్‌లోకి వచ్చింది. 

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ :205

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ :135

ఇండియా మొదటి ఇన్నింగ్స్ :365


Related Post