మార్చి 12 నుంచి భారత్‌-ఇంగ్లాండ్ 20-20 టెస్ట్ మ్యాచ్‌

February 21, 2021
img

భారత్-ఇంగ్లాండ్‌ నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత వరుసగా ఐదు 20-20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వాటిలో ఆడబోయే భారత్‌ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది.

భారత్‌ జట్టులోకి కొత్తగా గత సంవత్సరం ఐపీఎల్‌లో రాణించిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ తేవాటియా వచ్చారు.

మొదటి 20-20 మ్యాచ్ మార్చి 12వ తేదీన గుజరాత్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది.

మార్చి 14న రెండో 20-20 మ్యాచ్‌, 16న మూడో మ్యాచ్, 18న నాలుగో మ్యాచ్, చివరిగా మార్చి 20వ తేదీన ఐదవ 20-20 మ్యాచ్ జరుగనున్నాయి. 

 భారత జట్టు వివరాలు:

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తేవతీయ,  నటరాజన్, భువనేశ్వర్, దీపక్ చాహల్,  నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్.

మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు జట్టులో సల్ప మార్పులు ఉండవచ్చని బీసీసీఐ తెలిపింది.

Related Post