భారత్‌ క్రికెట్ జట్టుపై ఇమ్రాన్ ఖాన్‌ ప్రశంశలు

February 19, 2021
img

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత క్రికెట్ జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. స్వతహాగా క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ గురువారం ఇస్లామాబాద్‌లో స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన విజయం సాధించిందని అన్నారు. భారత్ మొదటి టెస్టు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, రెండో టెస్ట్ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిందని, ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపి గెలిచిందన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా భారత్ వీరోచితంగా పోరాడి గెలిచిందన్నారు. అహ్మదాబాద్‌లో జరుగబోయే మూడో టెస్ట్ మ్యాచ్‌లో కూడా భారత్ గెలవాలని ఇమ్రాన్ ఖాన్‌ అభిలషించారు.

భారత క్రికెట్ జట్టును చూసి పాకిస్థాన్ క్రికెట్ జట్టు కూడా నేర్చుకోవాలన్నారు. ఏ జట్టుకైనా ఓటమి సహజమని, ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని గెలుపుకు బాటలు వేసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ క్రికెట్ జట్టును కోరారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు విభేదాలను పక్కనపెట్టి సమిష్టిగా రాణించాలని అన్నారు. 

ఇమ్రాన్ ఖాన్‌ 1972 నుండి 1992 వరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆడారు. ఆయన సారధ్యంలోనే పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ కూడా గెలిచింది.

Related Post