త్వరలో హైదరాబాద్ లో యూఏఈ కౌన్సిలేట్ ఏర్పాటు

July 04, 2018
img

హైదరాబాద్ నగరంలో త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ కౌన్సిలేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం చర్చించేందుకు యూఏఈ విదేశీవ్యవహారాలశాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయీద్ అల్ నహయాన్ హైదరాబాద్ వచ్చి సిఎం కెసిఆర్ తో సమావేశం అయ్యారు. ఆయనతో పాటు భారత్ లో యూఏఈ రాయబారి డా.అహ్మద్ అబ్దుల్ రహ్మాన్ అల్ బన్నా, కేరళలో యూఏఈ కౌన్సిలేట్ జనరల్ జమాల్ అల్ జాబి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో యూఏఈ కౌన్సిలేట్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు సిఎం కెసిఆర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలేట్ భవన నిర్మాణం కోసం తగినంత స్థలం తక్షణం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణం పూర్తయేలోగా కేంద్రప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చే అవకాశం ఉంది కనుక మరొక 7-8 నెలలోగా  హైదరాబాద్ నగరంలో యూఏఈ కౌన్సిలేట్ ఏర్పాటు కావచ్చు.    


Related Post