మరో సినిమాలో కూడా శివమన్నార్ పాత్ర?

May 08, 2024


img

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మొదటి భాగంలో పృధ్వీరాజ్ సుకుమారన్ చేసిన శివమన్నార్ పాత్రలో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ పాత్ర గురించి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పృధ్వీరాజ్ సుకుమారన్ ఎవరూ ఊహించని సమాధానం చెప్పారు. 

ఈ పాత్ర సలార్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘సలార్ –శౌర్యాంగపర్వం’లోనే కాకుండా ప్రశాంత్ నీల్ చేయబోతున్న తదుపరి చిత్రంలో కూడా ఉంటుందని పృధ్వీరాజ్ సుకుమారన్ చెప్పడంతో ఆయన అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.

అయితే ‘సలార్ –శౌర్యాంగపర్వం’ పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ జూ.ఎన్టీఆర్‌తో ఒక సినిమా, యష్-నీల్ కాంబినేషన్‌లో చేయబోతున్న కేజీఎఫ్-3 రెండు సినిమాలు చేయబోతున్నాడు. కనుక ఈ రెంటిలో శివమన్నార్ పాత్ర ఏ సినిమాలో వాడుకుంటారు?అనే ఊహాగానాలు మొదలైపోయాయి.

కేజీఎఫ్-3 సినిమాకి దగ్గర దగ్గరగా సలార్‌ ఉంది కనుక కేజీఎఫ్-3 సినిమాలోనే శివమన్నార్ పాత్రకు అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 

సలార్‌-2 సినిమాలో ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రుతీ హాసన్, ఈశ్వరీ రావు, శ్రీయరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కూడా సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన్ గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

దీనిని కూడా హోంభోలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష