అమెరికాలో ఖాజీపేట ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి

March 13, 2024
img

అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రమాదవశాత్తు చనిపోయాడు. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల వెంకట రమణ (27) ఉన్నత చదువులు చదివేందుకు గత ఏడాది ఆగస్ట్ 22న అమెరికాలోని ఇండియానా యోనివర్సిటీలో చేరాడు. అక్కడ మాస్టర్స్ ఇన్‌ ఇన్ఫార్మటిక్స్  కోర్సు చేస్తున్నాడు.

మొన్న వారాంతపు సెలవు రోజున అంటే మార్చి 9న స్నేహితులతో కలిసి సరదాగా వెస్ట్ ఫ్లోరిడాలోని ఓ వాటర్ పార్కుకు వెళ్ళాడు. అక్కడ అందరూ నీళ్ళలో దిగి వాటర్ గేమ్స్ ఆడుతుండగా, ఓ వ్యక్తి వేగంగా వచ్చి వెంకటరమణని బలంగా ఢీకొన్నాడు. దాంతో వెంకట రమణ నీళ్ళలో మునిగిపోయి ఊపిరాడక చనిపోయాడు.

ఈ విషయం అతని స్నేహితులు కాజీపేటలో ఉంటున్న వెంకటరమణ తల్లితండ్రులకు తెలియజేయడంతో వారు షాక్ అయ్యారు. విదేశంలో ఉన్నత చదువులు చదివి చేతికి అందివస్తాడనుకున్న కొడుకు చనిపోయాడనే విషయం తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో నాలుగైదు రోజులలో వెంకటరమణ మృతదేహం కాజీపేటకు చేరుకునే అవకాశం ఉంది. 

Related Post