వారణాశి రిలీజ్ డేట్ వచ్చేసింది

January 30, 2026


img

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాశి’ నుంచి ఎవరూ ఊహించని అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా 2027, ఏప్రిల్‌ 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ పెట్టారు.

అంతేకాదు... యూపీలో వారణాశిలో కూడా సినిమా రిలీజ్ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టారు. ఆ రోజున తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది, మరాఠీ ప్రజలు గుడిపడవ పండుగలు పడ్డాయి. ఏప్రిల్‌ 14న అంబేద్కర్ జయంతి, ఏప్రిల్‌ 15న శ్రీరామ నవమి సందర్భంగా సెలవులు ఉంటాయి. కనుక అన్నీ చూసుకొని ఈ తేదీ ఖరారు చేసినట్లు అర్ధమవుతోంది.

రిలీజ్ పోస్టర్లో అంతరిక్షంలో నుంచి ఓ ఉల్క శకలాలు దూసుకువచ్చి భూమిని డీకొన్నట్లు చూపారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తండ్రి పాత్ర చేయబోతున్నారు. ఈ సినిమాలో విలన్‌ కుంభగా మలయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్, మందాకినిగా బాలీవుడ్‌ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా నటిస్తున్నారు.            

ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్‌: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్‌, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు. 

ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు. 

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా  నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్‌ 7న వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 


Related Post

సినిమా స‌మీక్ష