జన నాయగన్‌లో ఆ సన్నివేశాలు ఉన్నాయట అందుకే...

January 29, 2026


img

కోలీవుడ్‌ హీరో విజయ్‌ దళపతి ‘జన నాయగన్’ సినిమాపై మంగళవారం మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. సినిమాపై కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మీడియాకు చేరాయి. జస్టిస్ ఎంఎం శ్రీవాత్సవ, జస్టిస్ ఆరుళ్ మురుగన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏమన్నాదంటే, “ఈ సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జ్ ఆదేశించే ముందు సెన్సార్ బోర్డు చైర్మన్‌ అధికారాలను వివరించేందుకు, ఈ సినిమాలో అభ్యంతర సన్నివేశాలపై తమ వాదనలు వినిపించేందుకు సెన్సార్ బోర్డుకి తగినంత సమయం ఇవ్వలేదు. 

తమ సినిమాకు సింగిల్ జడ్జ్ యూ/ఏ సెన్సార్ +16 సర్టిఫికేట్ ఇచ్చినట్లు నిర్మాణ సంస్థ చెప్పుకుంది. కానీ అందుకు సాక్ష్యాధారాలు చూపలేకపోయింది. 

ఈ సినిమాలో మత సామరస్యానికి భంగం కలిగించేవి, భద్రతా దళాలకు సంబంధించి కొన్ని సన్నివేశాలున్నాయి. వాటిపై తొమ్మిది మందితో కూడిన రివైజ్ కమిటీకి పంపించాలని సెన్సార్ బోర్డు నిర్ణయించింది. ఈ విషయాలన్నీ సింగిల్ జడ్జ్ పరిగణనలోకి తీసుకొని మళ్ళీ తీర్పు చెప్పాలి,” అని ఆదేశించినట్లు తెలుస్తోంది. 

మత సామరస్యం, భద్రత దళాలతో ముడిపడిన ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు విడుదలయ్యాయి. నాడు అమీర్ ఖాన్ తీసిన పికె మొదలు లాల్ సింగ్ చడ్డా వరకు, తాజా చిత్రాలు అఖండ-2, బోర్డర్-2 వంటి సినిమాలలో ఇవే అంశాలున్నాయి. కానీ వాటన్నిటికీ సెన్సార్ బోర్డ్ ఇలా అభ్యంతరం చెప్పలేదు. అలాగే బాలకృష్ణ సినిమా ‘భగవంత్‌ కేసరి’కి సెన్సార్ బోర్డు అడ్డు చెప్పలేదు. కానీ దానికి రీమేక్ అన్నట్లుగా తీసిన ‘జన నాయగన్’కు అభ్యంతరం చెపుతోంది! 

విజయ్‌ సినిమాలకు స్వస్తి పలికి తమిళనాడు రాజకీయాలలో ప్రవేశిస్తున్నందుకేనా ఇన్ని అవరోధాలు?అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష