కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా #ఏఏ23 నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ఖరారు అయినట్లు తాజా సమాచారం. ఓ పాపులర్ సైన్స్ ఫిక్షన్ నవల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ సైంటిస్ట్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ సినిమా వివరాలు ప్రకటించడం ఇంకా ఆలస్యం చేస్తే ఇలాగే ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. కనుక త్వరలో అప్‌డేట్ ఇస్తారని ఆశిద్దాం.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు బన్నీవాస్, నట్టి, శాండీ, స్వాతి సహా నిర్మాతలు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నారు. త్వరలోనే పూజా కార్యక్రమం చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.