కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 60 శాతంపైగా షూటింగ్ పూర్తయింది. త్వరలో చెన్నైలో రెండు వారాల షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. దాంతో టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవికుమార్ నంబూరి, కధ: సాయి రాజేష్, సంగీతం: మణిశర్మ, కెమెరా: విశ్వాస డేనియల్ చేస్తున్నారు.
మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్ బ్యానర్లపై సాయి రాజేష్, ఎస్‌కెఎన్, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.