శుక్రవారం సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని ప్రశ్నిస్తున్న సమయంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్ సిపి, సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న విసి సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. నాడు ఓటుకు నోటు కేసులో విసి సజ్జనార్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, ఇప్పుడు ఆయనే సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నారని ఆరోపించారు.
దీనిపై విసి సజ్జనార్ వెంటనే తీవ్రంగా స్పందిస్తూఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి నోటీసు పంపించారు. రెండు రోజులలో తన ఆరోపణలకు సాక్ష్యాధారాలు చూపాలని లేకుంటే అవి అవాస్తవమని బహిరంగ ప్రకటన చేయాలని నోటీసులు పేర్కొన్నారు. లేకుంటే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నోటీసులో హెచ్చరించారు. దీనిపై ప్రవీణ్ కుమార్ ఇంకా స్పందించాల్సి ఉంది.