సంతోష్ శోభన్, మానస వారణాశి జంటగా చేస్తున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ నుంచి ‘గాబరా... గాబరా’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదలయ్యింది. రాకేందు మౌళి వ్రాసిన ఈ పాటని ఆదిత్య రవీంద్రన్ స్వరపరిచి సంగీతం అందించగా సంతోష్ నారాయణ్ ఆలపించారు.
ఈ సినిమాకు కధ దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్, సంగీతం: ఆదిత్య రవీంద్రన్, కెమెరా: దినేష్ పురుషోత్తం, ఎడిటింగ్: గణేశ్ శివ చేశారు.
యూవీ క్రియేషన్స్ పతాకంపై పి. అజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ సినిమా ఫిభ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున విడుదల కాబోతోంది.