ఓటీటీలోకి రాజాసాబ్ వచ్చేస్తున్నారహో!

January 30, 2026


img

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేసిన ‘ది రాజాసాబ్’ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. కానీ మొదటి షోతోనే నెగెటివ్ టాక్ వచ్చింది. పది రోజులలో రాజాసాబ్ తప్పకుండా కోలుకుంటారని మారుతి చెప్పినప్పటికీ అలా జరగలేదు. ప్రభాస్‌ కెరీర్లో ఇది మూడో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రభాస్‌ అభిమానులు సైతం తీవ్ర అసంతృప్తి చెందారు. 

ఇప్పుడీ ఈ సినిమా ఫిభ్రవరి 6 నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. కనుక ఓటీటీ ప్రేక్షకులు కూడా ‘రాజసాబ్’ చూసి ఎలా ఉందో చెప్పేస్తే తర్వాత చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోతుంది.    



Related Post

సినిమా స‌మీక్ష