శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’తో మంచి హిట్ అందుకున్న నాగార్జున, తన 100వ సినిమా తన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయేలా ఉండాలని కోరుకుంటున్నారు. కోలీవుడ్ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున చేయబోతున్న ఈ సినిమాకు ‘కింగ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇటీవల ఈ సినిమా గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు, “ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి బాగా మారింది. సినిమాలు సహజత్వానికి దగ్గర ఉండాలని కోరుకుంటున్నారు. కనుకే నా 100వ సినిమాలో గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు లేకుండా చాలా సహజంగా ఉండే కధతో తీయాలనుకుంటున్నాము.
ఈ సినిమాలో ‘టబూ’ కూడా నటించబోతున్నట్లు నాగార్జున సూచనప్రాయంగా తెలియజేశారు. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. కనుక నా 100వ సినిమాలో ఆమె కూడా భాగం కావాలనుకుంటున్నారు,” అని చెప్పారు. సినిమా రిలీజ్ డేట్ గురించి తానేమీ తొందరపడటం లేదని అన్ని పనులు పూర్తవుతున్నప్పుడే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు. త్వరలోనే (కింగ్) అప్‌డేట్ ఇస్తామని చెప్పారు.