ఫోన్ ట్యాపింగ్ కేసులో తన తండ్రి, మాజీ సిఎం కేసీఆర్‌కి సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “సిట్ విచారణ సీరియస్‌గా జరగడం లేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గుంపు మేస్త్రీ ఈ కేసుని ముందుకు నడిపిస్తున్నారు. ఈ కేసు విచారణ వీలైనంత వేగంగా పూర్తి చేసి, దీని వెనుక నేరస్తులకు శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
తన తండ్రి హయంలో తన ఫోన్, తన భర్త ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని కల్వకుంట్ల కవిత ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అంటే ఈ కేసులో ప్రధాన సూత్రధారి తన తండ్రే అని ఆమె చేపుతున్నట్లు భావించవచ్చు. కేసీఆర్‌కి నోటీస్ ఇవ్వడాన్ని కేటీఆర్, హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ గట్టిగా ఖండిస్తున్నారు. కానీ తండ్రికి నోటీస్ ఇస్తే ఆమె ఖండించే బదులు విచారణ త్వరగా ముగించి నేరస్తులకు శిక్షలు పడేలా చేయాలని కోరడం గమనిస్తే, తండ్రి విషయంలో కూడా ఆమె వైఖరి పూర్తిగా మారినట్లు అర్ధమవుతోంది. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే...
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. "రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం కావాలనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్… pic.twitter.com/X5FHkLCjV7
(Video courtesy: Chota News App)