కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు సింగరేణిని ముంచేస్తున్నాయి!

January 22, 2026


img

కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి సంస్థ గురించి సామాన్య ప్రజలకు తెలియని అనేక సంచలన విషయాలు మీడియా ద్వారా బయటపెట్టారు. 

1. బీఆర్ఎస్‌ ప్రభుత్వం సింగరేణికి రూ.32,000 కోట్ల బకాయిలు పెట్టింది.   

2. కాంగ్రెస్‌ ప్రభుత్వం  సింగరేణికి మరో రూ.15,000 కోట్లు బకాయిలు పెట్టింది. రెండు ప్రభుత్వాలు కలిసి మొత్తం సింగరేణికి రూ.47,000 కోట్ల బకాయిలు పెట్టాయి. ఇంతవరకు వాటిని చెల్లించలేదు. 

3. కోల్‌ ఇండియా బొగ్గు నాణ్యత 86 శాతం. గ్రేడ్-11 బొగ్గు ధర టన్నుకి రూ. 1,605. 

4. సింగరేణి బొగ్గు నాణ్యత 48 శాతం. గ్రేడ్-11 బొగ్గు ధర టన్నుకి రూ. 4,088. 

5. ఈ కారణంగా పలు రాష్ట్రాలు, ఎన్టీపీసీలు సింగరేణి బొగ్గు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. 

6. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి డబ్బు దండుకుంటోంది తప్ప అప్పులు చెల్లించడం లేదు. ఈ కారణంగా సింగరేణి సంస్థ ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు అప్పులు చేస్తోంది. 

7. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నేతలు సింగరేణి భూములు కబ్జాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. 

8. నైనీ బొగ్గు గనుల కోసం ఇద్దరు కాంగ్రెస్‌ మంత్రుల మద్య జరిగిన గొడవ ఇందుకు తాజా నిదర్శనం. ప్రభుత్వం కోరితే దీనిపై సీబీఐ చేత దర్యాప్తు చేయిస్తాను.   

9. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ ప్రభుత్వాల తీరు ఈవిధంగా ఉండటం వలన సింగరేణి నష్టాల ఊబిలో కూరుకుపోయి మూతపడే ప్రమాదం పొంచి ఉంది. 

10. సింగరేణిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేస్తే, ఈ లోపాలన్నిటినీ సరిచేసి మళ్ళీ లాభాల బాట పట్టిస్తామని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.


Related Post