ఎన్నాళ్ళకెన్నాళ్ళకు గద్దెలపైకి వనదేవతలు..

January 29, 2026
img

మేడారం మహా జాతరలో వన దేవతలని దర్శించుకునేందుకు భక్తులు రెండేళ్ళుగా ఎదురు చూస్తున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజు మేడారంలో గద్దెలపైకి చేరుకోవడంతో, ఆ వన దేవతలను చూసి భక్తులు భక్తితో పరవశించిపోయారు.

జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి వనదేవతలను దర్శించుకొని బంగారం (బెల్లం దిమ్మలు) మొక్కులు చెల్లించుకుంటున్నారు.

మేడారం మహా జాతరలో మరో కీలక ఘట్టం ఈరోజు సాయంత్రం జరుగబోతోంది. మేడారం సమీపంలో గల చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కని తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించడం.     

గత నెలరోజులుగా మేడారంకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. నిన్న ఒక్క రోజే ఇప్పటికే సుమారు 10 లక్షల మంది భక్తులు వచ్చిన్నట్లు అధికారులు అంచనా. నేటి నుంచి భక్తుల రద్దీ ఇంకా భారీగా పెరుగుతుంది.

ఆంధ్రా, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో అటవీ ప్రాంతాలలో నివసించే ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున మేడారం మహా జాతరకు తరలివస్తున్నారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రం వనదేవతలు తిరిగి వన ప్రవేశం చేయడంతో మేడారం మహా జాతర ముగుస్తుంది. 


Related Post