శ్రీనందు, యామినీ భాస్కర్ ప్రధాన పాత్రలలో వచ్చిన ‘సైక్ సిద్ధార్థ’ జనవరి 1న విడుదలైంది. ఇప్పుడీ సినిమా ఫిభ్రవరి 4 నుంచి ఆహా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
వరుణ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నరసింహ, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సుకేష్, వాడేకర్ నర్సింగ్, బాబీ రాతకొండ, సాక్షి ఆత్రీ చతుర్వేది, మౌనిక, ప్రద్యుమ్న ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే: శ్రీ నందు, సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: కె ప్రకాష్ రెడ్డి, ఎడిటింగ్: ప్రతీక్ నూతి చేశారు.
ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డితో కలిసి సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు.