సల్మాన్ దుల్కర్‌ సినిమాలో శ్రుతీ హాసన్

January 29, 2026


img

పవన్ సాదినేని దర్శకత్వంలో సల్మాన్ దుల్కర్‌ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి అనే కొత్తమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి శ్రుతీ హాసన్ ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నారు. 

మొదట సల్మాన్ దుల్కర్‌కి జోడీగా సాయి పల్లవిని అనుకున్నారు కానీ కధను బట్టి కొత్త అమ్మాయి అయితేనే బాగుంటుందని సాత్విక వీరవల్లిని తీసుకున్నట్లు తెలుస్తోంది.  

ఈ సినిమాకు కధ: గంగరాజు గుణ్ణం, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్‌, కెమెరా: సుజీత్ సారంగ్ చేస్తున్నారు. 

సుప్రసిద్ద సినీ నిర్మాణ సంస్థలు వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమాస్, లైట్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిసి ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్‌తో నాలుగు భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నాయి. ఈ సినిమాకి నిర్మాతలు సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం.

 


Related Post

సినిమా స‌మీక్ష