రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా ‘నారి నారీ నడుమ మురారి’ జనవరి 14న సంక్రాంతి పండుగ రోజున విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ సినిమా ఫిభ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తోందని తెలియజేస్తూ ఆ సంస్థ ఓ పోస్టర్ వేసింది. ఒకేసారి 5 భాషల్లో ప్రసారం కాబోతోంది.
ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు నరేష్, వెన్నెల కిషోర్, సునీల్, శ్రీవిష్ణు, సత్య ఆకెళ్ళ తదితరులు చేసిన కామెడీతో ప్రేక్షకులు మెప్పించారు. అందరూ కలిసి కామెడీ అదరగొట్టేశారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం: రామ్ అబ్బరాజు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞాన శేఖర్, యువరాజ్ చేశారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కలిసి నిర్మించారు.