శర్వా బైకర్ రిలీజ్ డేట్ మారింది

January 30, 2026


img

శర్వానంద్ నటించిన ‘బైకర్’ డిసెంబర్‌ 6న విడుదల కావాల్సి ఉండగా సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో దానిని పక్కన పెట్టి డిసెంబర్‌ 6న నారీ నారీ నడుమ మురారీతో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టారు.

ఇప్పుడు మళ్ళీ బైక్ ఎక్కి స్పీడుగా డ్రైవ్ చేస్తున్నారు. ఏప్రిల్‌ 3 లేదా 4న బైకర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే రెండున్నర నెలల గ్యాప్‌లో రెండు సినిమాలన్న మాట! ఇది కూడా హిట్ అయితే శర్వా కెరీర్లో ఒకే సం.లో రెండు హిట్ సినిమాల రికార్డ్ కూడా ఏర్పడుతుంది.      

బైకర్ పేరు, ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే కధ ఏమిటో, దేని గురించో  చెప్పేశారు దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర. కానీ పూర్తిగా బైక్ రేస్ స్టోరీతో సినిమా తీసి అందరినీ మెప్పించడం చాలా కష్టమే. కనుక కాస్త రోమాన్స్ కూడా అవసరమే. కనుక జోడీగా మాళవిక నాయర్‌తో శర్వా రోమాన్స్ జోడిస్తున్నారు. ఈ సినిమాలో శర్వా తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.           

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గిబ్రన్; కెమెరా: జె యువరాజ్; ఎడిటింగ్: అనిల్ పాశాల; స్టంట్స్: దిలీప్ సుబ్రమణియన్; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం చేస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష