రామ్‌ చరణ్‌ దంపతులకు కవల పిల్లలు

February 01, 2026
img

ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. వారిలో ఒకరు మగ, మరొకరు ఆడ శిశువు కావడంతో వారు, వారి కన్న తల్లితండ్రులు, సన్నిహిత బంధుమిత్రులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఇదివరకు వారికి ఓ కుమార్తె జన్మించగా ఆ పాపకు ‘క్లింకారా’ అని పేరు పెట్టారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, రామ్‌ చరణ్‌లకు వారసుడు పుడితే బాగుండును అని అందరూ అనుకున్నారు. ఈసారి వారందరి కోరిక తీర్చేస్తూ మెగా వారసుడు పుట్టాడు. కనుక మెగా ఫ్యామిలీ, మెగా అభిమానుల సంతోషానికి అవధులే లేవు.              


Related Post