సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని... అంటే ఏదో అనుకున్నారా? అది శివాజీ, లయ ప్రధాన పాత్రలు చేసిన క్రైం కామెడీ సినిమా. ఈ సినిమా ఫిభ్రవరి 12న నేరుగా ఈటీవి విన్ ఓటీటీలోనే విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాని కాన్సెప్ట్ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? ఓ పక్క భార్య, కొడుకు మరో పక్క ముగ్గురు నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడని శివాజీని వేధించడం అందరూ హాయిగా నవ్వుకునేలా తీశారు.
ఈ సినిమాలో శివాజీ, లయ భార్య భర్తలుగా నటించారు. ఆలి ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ దర్శకత్వం: సుదీర్ శ్రీరాం, సంగీతం:రంజిన్ రాజ్, కెమెరా:రిత్విక్ రెడ్డి, ధీరజ్ పి, ఎడిటింగ్: బాలు మనోజ్ చేశారు.
శ్రీశివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ స్వయంగా నిర్మించి ప్రధాన పాత్ర చేశారు. ఈ వీడియో లింక్ ఇదిగో: https://youtu.be/Qtbsz5gKnvE?si=wdIwC0SCi2_aLNAG