ఫిభ్రవరి 11న జరుగబోతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు శుక్రవారం సాయంత్రం నామినేషన్లు గడువు ముగిసింది. మొత్తం 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలకు కలిపి 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న చివరిరోజున ఏకంగా 19,180 నామినేషన్లు దాఖలయ్యాయి.
మూడు ప్రధాన పార్టీలతో పాటు ఆమాద్మీ, బీఎస్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వంటి అనేక చిన్న పార్టీల తరపున కూడా అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. పోలింగ్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో మూడు ప్రధాన పార్టీలతో సహా అభ్యర్ధులందరూ నామినేషన్లు వేసిన వెంటనే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు.
ఇప్పటికీ కొందరు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు, సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు.