తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ అందరినీ ఎంతగానో అలరించింది. ఇప్పుడు అటువంటి ప్రేమ కధతోనే వస్తున్న ‘బ్యాండ్ మేళం’లో యువనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటించారు. ఇదివరకు వీరిద్దరూ కలిసి నటించిన ‘కోర్ట్-వర్సస్ నో బడీ’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ యూనిట్ సభ్యులతో కలిసి శ్రీదేవి ఓ గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో ఆమె ఓ పల్లెటూరి గడుసు అమ్మాయి రాజమ్మగా నటించింది.
ఈ సినిమాకి కధ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే: శివ ముప్పరాజు, సంగీతం: విజయ్ బులగనిన్, కెమెరా: సతీష్ ముత్యాల చేస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కాబోతోంది.