బ్లడీ రోమియోతో పూజా హెగ్డే రోమాన్స్

February 03, 2026


img

ఓజీతో పవన్‌ కళ్యాణ్‌కి సూపర్ హిట్ ఇచ్చిన యువ దర్శకుడు సుజీత్. దాని తర్వాత వెంటనే నాచురల్ స్టార్‌ నానితో ‘బ్లడీ రోమియో’ అనే మరో సినిమా మొదలుపెట్టాడు. ఒకప్పుడు వరుసగా అనేక సూపర్ హిట్ సినిమాలు చేసిన పూజా హెగ్డే, కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమకి దూరమైంది. మళ్ళీ ఈ సినిమాలో నానికి జోడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మళయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారాన్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు.  

 ఈ సినిమాకి కధ, దర్శకత్వం సుజీత్ చేస్తుండగా సూపర్ హిట్ హిందీ సినిమా ‘దురంధర్’కి సంగీతం అందించిన శాస్వత్ సచ్‌దేవ్ సంగీతం అందిస్తున్నారు. 

నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్, యునానిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి ఈ సినిమా నిర్మిస్తున్నారు. గత ఏడాది దసరా నాడు ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. కానీ రెగ్యులర్ షూటింగ్ మరో రెండు మూడు నెలల్లో మొదలవుతుంది. ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష