తెలంగాణ ప్రభుత్వోద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుకి ప్రభుత్వం రూ.720 కోట్లు విడుదల చేయబోతోంది. దీంతో పాటు 2022 నుంచి 2025 ఫిభ్రవరి వరకు సరెండర్ లీవుల బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది.
దీనిపై ప్రభుత్వోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయడం ఓటర్లను ప్రలోభపెట్టడమే అవుతుంది.
ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్పవచ్చు. కానీ అభ్యంతరం చెపితే ప్రభుత్వోద్యోగులకు ఆగ్రహం కలుగుతుంది. దాని వలన మున్సిపల్ ఎన్నికలలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
కనుక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు విడుదల చేస్తూ, రాజకీయ లబ్ది పొందబోతున్నా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. కనుక పెండింగ్ బిల్లుల చెల్లింపుకి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయమే ఎంచుకున్నట్లు చెప్పవచ్చు.