కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్‌

February 03, 2026


img

సంతోష్ శోభన్, మానస వారణాశి జంటగా చేస్తున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఈ నెల 14న వాలంటైన్స్ డే రోజున విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ట్రైలర్‌ విడుదల చేశారు.   లివింగ్-ఇన్-రిలేషన్ అనే కొత్త పాయింట్ తీసుకుని దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ కధ వ్రాసుకున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్‌ బాగానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో ఫిభ్రవరి 14న విడుదలైతే తెలుస్తుంది. 

యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై పి. అజయ్ కుమార్‌ రాజు నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: ఆదిత్య రవీంద్రన్, కెమెరా: దినేష్ పురుషోత్తం, ఎడిటింగ్: గణేశ్ శివ చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష