విశ్వక్‌ సేన్‌ ఫంకీ నుంచి మరో పాట

February 01, 2026


img

అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ చేస్తున్న ‘ఫంకీ’ నుంచి రట్టాటటాచ్ అంటూ చాలా హుషారుగా సాగే రెండో పాట నేడు విడుదలైంది. దేవీశ్రీ ప్రసాద్‌ పవార్ వ్రాసిన ఈ పాటని భీమ్స్ సిసిరోలియో స్వరపరిచి సంగీతం అందించగా రామ్‌ మిరియాల పాడారు.     

ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ ఓ సినీ దర్శకుడుగా నటించగా, హీరోయిన్‌ కాయడు లోహర్‌ ఆ సినీ నిర్మాతగా నటించింది. నిర్మాత, దర్శకుడు ప్రేమలో పడితే కామెడీకి, రోమాన్స్ కి కొరతే ఉండదని టీజర్‌లో చూపించేశారు. ఈ సినిమాలో నరేష్, విటివి గణేశ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్  సీసీరిలియో, కెమెరా: సురేష్ సంగం, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.  

 శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష