శనివారం ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి తల్లి, కొడుకు, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. వారు భువనగిరి మండంలం బొల్లేపల్లి గ్రామానికి చెందినా పి సురేందర్ రెడ్డి భార్య విజయ (35), కొడుకు విశాల్ (17), కుమార్తె చేతన (16)గా పోలీసులు గుర్తించారు. వారు ముగ్గురూ చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో నడుచుకు వెళుతుండగా సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది.
ఆ ఫోటో, వీడియో ఆధారంగా పోలీసులు వారిని గుర్తించారు. వారు నగరంలో బోడుప్పల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రైలుకి ఎదురుగా వెళ్ళడంతో వారి ముగ్గురి శరీరాలు తునాతునకలు అయ్యి చెల్లాచెదురుగా పడ్డాయి. పోలీసులు వాటిని సేకరించి పోస్టు మార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకొని బోడుప్పల్లో వారు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్ళి విచారణ జరుపుతున్నారు. ఆమె భర్త సురేందర్ రెడ్డి ఆచూకీ తెలిస్తే వారి ఆత్మహత్యకు కారణం తెలిసే అవకాశం ఉంటుంది.
తల్లి చేతులు పట్టుకొని వెళుతున్న ఆ ఇద్దరూ చిన్న పిల్లలు కారు. కానీ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నామనే భయం ఏమాత్రం లేకుండా తల్లి చేతులు పట్టుకొని వెళ్ళారు. పాపం ఏం కష్టమొచ్చిందో వారికి?