ఈరోజు ఉదయం కోఠీ వద్ద గల ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఏం వద్ద ఇద్దరు దుండగులు తుపాకీతో రషీద్ అనే వస్త్ర వ్యాపారిపై కాల్పులు జరిపి ఆరు లక్షలు ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ మీడియాకు కొన్ని వివరాలు తెలియజేశారు.
నిందితులు కాల్పులు జరిపిన చాదర్ ఘాట్ మీదుగా నింబోలీ అడ్డ అక్కడి నుంచి కాచిగూడ వైపు వెళ్ళారు. దారిలో ఓ చోట స్కూటర్ వదిలేసి అక్కడే రోడ్డుపై చొక్కాలు మార్చుకున్నారు. అక్కడి నుంచి కాచిగూడ చౌరస్తా వైపు వెళ్ళినట్లు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది.
అక్కడి నుంచి వారు ఎటువైపు వెళ్ళారో మా పోలీస్ బృందాలు ఆచూకీ తీసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో ఇతర కమీషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లతో అనుసంధానం చేసుకొని అన్ని వైపుల నుంచి గాలింపు జరుపుతున్నాము. వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటాము,” అని విసి సజ్జనార్ చెప్పారు.
కాల్పులలో గాయపడిన రషీద్ ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. ఆయన కాలులో దిగిన తూటాని వైద్యులు శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకొని దాని ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.