అమెరికాలో సత్యనారాయణ వ్రతం... జనగామ నుంచి ఆన్‌లైన్‌లో!

March 07, 2024
img

అవును! అమెరికాలో ఓ తెలంగాణవాసి కొత్తగా కొనుకున్న ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని ఇక్కడ జనగామ జిల్లా నుంచి ఆన్‌లైన్‌లో జరిపించేశారు ఓ పంతులుగారు!

అమెరికాలో లక్షల మంది హిందువులున్నారు కనుక శుభ, అశుభ కార్యక్రామాలకు పురోహితులు కూడా చాలా మందే అందుబాటులో ఉన్నారు. కానీ అమెరికాలో ఏ చిన్న సేవ (సర్వీస్)కైనా చాలా భారీగా డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కనుక గృహాప్రవేశం, సత్యనారాయణ వ్రతం రెంటికీ చాలా ఖర్చవుతుంది.

కనుక సదరు తెలంగాణవాసి ఈ సరికొత్త ఐడియాతో చాలా తక్కువ ఖర్చుతో పని కానిచ్చేశారు. 

జనగామ జిల్లా, జఫర్‌ఘడ్ మండలంలోని కూనూరు గ్రామానికి చెందిన సంతోష్ శర్మ అనే పంతులుగారు మొబైల్ ఫోన్లో వీడియో కాలింగ్ ద్వారా మంత్రాలు చదువుతూ వ్రత విధానం వివరిస్తుంటే, అక్కడ అమెరికాలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సదరు వ్యక్తి గృహాప్రవేశం చేసి, సత్యనారాయణ వ్రతం చేశారు.

మనుషులు ఎక్కడ ఉన్నారనేది కాదు ముఖ్యం... కార్యక్రమం సక్రమంగా జరిగిందా లేదా అనేదే ముఖ్యం అని సంతోష్ శర్మగారు చెప్పారు. నిజమే కదా?

Related Post