ఆస్ట్రేలియాలో తెలుగు వైద్య విధ్యార్ధిని మృతి

March 09, 2024
img

ఏపీలోని కృష్ణాజిల్లాలోని ఉంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన వేమూరు ఉజ్వల (23) అనే వైద్య విద్యార్ధిని ఆస్ట్రేలియాలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల్లితండ్రులు మైధిలి, వెంకటేశ్వర రావు చాలా కాలంగా ఆస్ట్రేలియాలోనే స్తిరపడటంతో ఉజ్వల ఆస్ట్రేలియాలో గోల్డ్ కోస్ట్‌లో బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అక్కడే రాయల్ బ్రిస్బేన్ విమెన్స్ హాస్పిటల్లో పనిచేస్తూ, పీజీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంది.

కానీ ఈనెల 2వ తేదీన స్నేహితులతో కలిసి గోల్డ్ కోస్ట్ సమీపంలోగల కొండలలోకి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తూ కాలు జారి పక్కనే ఉన్న లోయలో పడి చనిపోయింది!

ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న కూతురు ఉజ్వల అర్దాంతరంగా చనిపోవడంతో తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తల్లితండ్రులు ఆమె మృతదేహాన్ని తీసుకొని శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తమ స్వగ్రామమైన ఎలుకపాడు చేరుకొని అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 

తమ మనుమరాలు గొప్ప వైద్యురాలిగా తిరిగి వస్తుందనుకుంటే శవపేటికలో విగతజీవిగా చూసి ఆమె అమ్మమ్మ, తాత్తయ్యలు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి దుఃఖం చూసి గ్రామస్తులు కూడా కంట తడిపెట్టుకొని బాధపడ్డారు.

Related Post